‘సీతారామం’ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన డైరెక్టర్: నెక్స్‌ట్ ఏంటీ.?

- August 19, 2022 , by Maagulf
‘సీతారామం’ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన డైరెక్టర్: నెక్స్‌ట్ ఏంటీ.?

‘అందాల రాక్షసి’ ఫేమ్ హను రాఘవపూడి మొదట్నుంచీ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంటాడు. కొన్ని సక్సెస్‌లు, ఇంకొన్ని ఫెయిల్యూర్స్‌తో డైరెక్టర్‌గా తన రూటే సెపరేటు అనిపించుకుంటున్నాడు. 
తాజాగా ‘సీతారామం’ సినిమా డైరెక్టర్‌గా హను రాఘవపూడిని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లిందనే చెప్పాలి. ముఖ్యంగా డిఫరెంట్ అండ్ క్యూట్ లవ్ స్టోరీస్‌ని విభిన్నంగా చెప్పడంలో హను రాఘవపూడిది అందె వేసిన చేయి. ‘సీతారామం’ సినిమా తర్వాత టాలీవుడ్ దృష్టి హనుపై పడింది.
స్టార్ హీరోలు కూడా హను రాఘవపూడిని లైన్‌లో పెట్టాలనుకుంటున్నారట. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నుంచి హను రాఘవపూడికి ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందట. త్వరలోనే దానికి సంబంధించి డీటెయిల్స్ వెల్లడి కానున్నాయట. 
ఇప్పటికే హను డైరెక్షన్‌లో నేచురల్ స్టార్ నాని, శర్వానంద్ తదితర హీరోలు నటించారు. నాని నటించిన ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. శర్వానంద్ ‘పడి పడి లేచె మనసు’ సినిమా కాస్త నిరాశ పరిచినా ఫీల్ గుడ్ మూవీ లిస్టులోనే వుంది. ఇక, తాజా మూవీ ‘సీతారామం’తో హను బౌన్స్ బ్యాక్ అయ్యాడు. చూడాలి మరి, హను నెక్స్‌ట్ ఎవరితో, ఏం మ్యాజిక్ చేయబోతున్నాడో.! 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com