ఖతార్‌లో ప్రారంభమైన మొదటి చెక్‌అవుట్ రహిత స్టోర్

- August 22, 2022 , by Maagulf
ఖతార్‌లో ప్రారంభమైన మొదటి చెక్‌అవుట్ రహిత స్టోర్

దోహా: కస్టమర్ల డిమాండ్‌లను తీర్చడానికి.. వినూత్న టెక్నాలజీతో కస్టమర్లకు విశిష్ట సేవలను అందించడానికి చెక్‌అవుట్-ఫ్రీ టెక్నాలజీని అందించే ప్రముఖ సంస్థ జిప్పిన్‌తో చేతులు కలిపినట్లు అల్ మీరా కన్స్యూమర్ గూడ్స్ కంపెనీ ప్రకటించింది. తమ కస్టమర్లకు స్నాక్స్, పానీయాలు, గ్రాబ్-అండ్-గో భోజనం ఇతర అవసరమైన వస్తువులను క్యాషియర్-లెస్ ప్రక్రియలో అందించడానికి అల్ మీరా త్వరలో వ్యూహాత్మక ప్రదేశాలలో స్టోర్స్ ను తెరవనున్నట్లు వెల్లడించింది. ఇది ఖతార్ నేషనల్ విజన్ 2030 ప్రకారం.. నగదు రహిత చెల్లింపు పరిష్కారాలను ప్రోత్సహించడానికి, ఆర్థిక వృద్ధిని సులభతరం చేయడానికి ఆధునిక టెక్నాలజీ పరిష్కారాలను ఉపయోగించి డిజిటల్ మార్పును సాధించడానికి దేశం యొక్క వ్యూహానికి అనుగుణంగా కొత్త పాలసీని తెచ్చిన్నట్లు కంపెనీ తెలిపింది. జిప్పిన్‌ (Zippin) మల్టీమోడల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో ఈ స్టోర్స్ నడుస్తాయని పేర్కొంది. స్మార్ట్ స్టోర్‌లు కెమెరాలు, సెన్సార్‌ల సాయంతో పనిచేస్తాయని తెలిపింది. ఇవి కస్టమర్‌లను ప్రవేశించినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు ట్రాక్ చేస్తాయన్నారు. షాపింగ్ లావాదేవీలను వేగంగా, సరళంగా కస్టమర్‌ల కొనుగోలు ప్రక్రియను సులభతరం, వేగవంతం చేస్తుందని కంపెనీ తెలిపింది. మొదటి అవుట్‌లెట్ రాబోయే FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 సందర్భంగా కస్టమర్లకు కొత్త అనుభూతిని అందించడంతోపాటు టోర్నమెంట్ విజయానికి దోహదం చేస్తాయని పేర్కొంది. చెక్అవుట్ రహిత స్టోర్‌ల సాఫ్ట్‌వేర్ ఓవర్‌హెడ్ కెమెరాలు, సెన్సార్‌లు వర్చువల్ షాపింగ్ కార్ట్‌ను సృష్టిస్తుందని, కస్టమర్‌లు స్టోర్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆటోమెటిక్ గా వారి క్రెడిట్ కార్డ్ నుండి కొనుగోలు చేసిన వస్తువుల మొత్తాన్ని సాఫ్ట్‌వేర్ నేరుగా డెబిట్ చేస్తుందని అల్ మీరా కన్స్యూమర్ గూడ్స్ కంపెనీ వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com