మీడియా రంగంలోకి అదానీ గ్రూప్
- August 23, 2022
ముంబై: వ్యాపార రంగంలో తిరుగు లేకుండా దూసుకుపోతున్న అదానీ గ్రూప్.. ఇప్పుడు మీడియాలోకీ ఎంట్రీ ఇస్తోంది. NDTV హస్తగతం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను పరోక్షంగా తమ గ్రూప్ సంస్థ కొనుగోలు చేయనున్నట్లు అదానీ ఎంటర్ ప్రైజెస్ తెలిపింది. మరో 26శాతం వాటాల కొనుగోలుకు రెండు సంస్థలతో కలిసి అదానీ ఎంటర్ ప్రైజెస్ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది.
విశ్వప్రదాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్, ఏఎంజీ మీడియా నెట్ వర్క్స్ తో కలిసి పబ్లిక్ షేర్ హోల్డర్ల నుంచి వాటాలను కొనుగోలు చేయనుంది అదానీ ఎంటర్ ప్రైజెస్. 4 రూపాయల ముఖ విలువ కలిగిన కోటి 67లక్షలకు పైగా షేర్లను ఈ సంస్థలతో కలిసి అదానీ గ్రూప్ సొంతం చేసుకోనుంది. ఒక్కో షేర్ కు 294 రూపాయలను ఆఫర్ చేసింది అదానీ సంస్థ. ఓపెన్ ఆఫర్లలో షేర్ల కొనుగోలుకు 492.8 కోట్లు చెల్లించనుంది. ఎన్డీటీవీని ప్రణయ్ రాయ్ ప్రారంభించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







