జనాన్ని చూసి ‘లైగర్’ ఎందుకంత షాక్ అవుతున్నాడు.?

- August 24, 2022 , by Maagulf
జనాన్ని చూసి ‘లైగర్’ ఎందుకంత షాక్ అవుతున్నాడు.?

‘సాలా ది క్రాస్ బ్రీడ్’ అనే ట్యాగ్ లైన్‌తో రూపొందుతోన్న సినిమా ‘లైగర్’. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసేలా చిత్ర యూనిట్ తమ ప్రయత్నాలు చేస్తోంది గత కొంత కాలంగా. 
ఇప్పటికే బజ్ బాగానే క్రియేట్ అయ్యింది. ప్యాన్ ఇండియా వైజ్ ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఆగస్ట్ 25 అంటే ఈ శుక్రవారమే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రకరకాల ప్రచార చిత్రాలు, ఇన్నోవేటివ్ ప్రమోషన్లతో ‘లైగర్’ టీమ్ మస్త్ బిజీగా వుంది. 
అయితే, విజయ్ దేవరకొండ ఎక్కడికి వెళ్లినా, జనం కోకొల్లలుగా తరలి వస్తున్నారు. ఆ మాస్ ఫాలోయింగ్ చూసి, విజయ్ దేవరకొండనే షాకవుతున్నాడట. అంతలా విజయ్ దేవరకొండలో ఏం ఎట్రాక్షన్ వుందో కానీ, ఇక్కడా, అక్కడా అనే తేడా లేకుండా జనం తరలి వస్తున్నారు.
ఆ జనాన్ని చూసి, చాలా చాలా మాట్లాడాలనుకున్నా, నోటి వెంట మాటలు రావడం లేదంటూ విజయ్ చెబుతున్నాడు. ఆ ఆనందం తట్టుకోలేకపోతున్నాననీ అంటున్నాడు. విజయ్ ప్రమోషన్ ఈవెంట్లకు ఇంతలా తరలి వస్తున్న జనం రేపు సినిమా విడుదలయ్యాకా, చూసేందుకు వస్తారా.? వస్తే కనుక అదో ప్రభంజనమే. 
ముఖ్యంగా బాలీవుడ్ బాక్సాఫీస్ ఆశలన్నీ ‘లైగర్’ పైనే. ఈ సినిమాని బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్, పూరీ కనెక్ట్స్‌తో కలిసి నిర్మించిన సంగతి తెలిసిందే. అనన్యా పాండే హీరోయిన్‌గా నటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com