ప్రవాసులకు శుభవార్త..
- August 24, 2022
న్యూ ఢిల్లీ: ఎన్నారై విద్యార్థులకు మేలు కలిగేలా భారత ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం అమలులోకి వస్తే.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులకు చాలా వరకు ఇబ్బందులు తప్పనున్నాయి.
ఇండియాలోని ఐఐటీలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశ వ్యాప్తంగా ఉన్న పలు IIT క్యాంపస్లలో అడ్మిషన్ పొందేందుకు వేలాది మంది విద్యార్థులు పోటీ పడతారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు కూడా ఐఐటీల్లో చేరేందుకు ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐఐటీలను ఇతర దేశాలకు విస్తరించాలని భావిస్తోంది.ఇండియన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ పేరుతో దాదాపు ఏడు దేశాల్లో వీటిని ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది.ఈ క్రమంలోనే యూకే, యూఏఈ, ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతర్, మలేషియా, థాయ్లాండ్ దేశాల్లో క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు 17 మంది సభ్యులతో కూడిన ఓ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ కమిటీ కూడా ఇప్పటికే ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో ఐఐటీల ఏర్పాటుకు సంబంధించి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కాగా.. విదేశాల్లో ఐఐటీ క్యాంపస్లు ఏర్పాటైతే.. ఎన్నారై విద్యార్థులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







