ప్రవాసులకు శుభవార్త..

- August 24, 2022 , by Maagulf
ప్రవాసులకు శుభవార్త..

న్యూ ఢిల్లీ: ఎన్నారై విద్యార్థులకు మేలు కలిగేలా భారత ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం అమలులోకి వస్తే.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులకు చాలా వరకు ఇబ్బందులు తప్పనున్నాయి. 

ఇండియాలోని ఐఐటీలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశ వ్యాప్తంగా ఉన్న పలు IIT క్యాంపస్‌లలో అడ్మిషన్ పొందేందుకు వేలాది మంది విద్యార్థులు పోటీ పడతారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు కూడా ఐఐటీల్లో చేరేందుకు ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐఐటీలను ఇతర దేశాలకు విస్తరించాలని భావిస్తోంది.ఇండియన్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ పేరుతో దాదాపు ఏడు దేశాల్లో వీటిని ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది.ఈ క్రమంలోనే యూకే, యూఏఈ, ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతర్, మలేషియా, థాయ్‌లాండ్ దేశాల్లో క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు 17 మంది సభ్యులతో కూడిన ఓ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ కమిటీ కూడా ఇప్పటికే ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో ఐఐటీల ఏర్పాటుకు సంబంధించి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కాగా.. విదేశాల్లో ఐఐటీ క్యాంపస్‌లు ఏర్పాటైతే.. ఎన్నారై విద్యార్థులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com