భార్య చిటికెన వేలును విరగ్గొట్టిన వ్యక్తి అరెస్ట్
- August 25, 2022
బహ్రెయిన్: తన భార్యపై దాడి చేసి చిటికెన వేలును విరగ్గొట్టాడన్న ఆరోపణలపై హై క్రిమినల్ కోర్టు బహ్రెయిన్ యువకుడిపై విచారణ ప్రారంభించింది. పోలీసు రికార్డుల ప్రకారం.. ఇంట్లో ఉన్న సమయంలో దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. 28 ఏళ్ల నిందితుడు ఆమెను తన్నాడు. బాధితురాలు తన చేతులతో తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించింది. ఈ గొడవలో ఆమె చిటికెన వేలు విరిగిపోయింది. తరువాత అతను ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. గాయానికి చికిత్స చేయడానికి అత్యవసర శస్త్రచికిత్స అవసరమైంది. శస్త్రచికిత్స విజయవంతం అయినప్పటికీ, వైద్య నివేదికలో మహిళకు శాశ్వతంగా వేలుకు నష్టం జరిగినట్లు సూచించింది. విచారణలో, వ్యక్తి తన భార్యపై దాడి చేసినట్లు ఒప్పుకున్నాడని, దీంతో అతనిపై భౌతిక దాడి, తన భార్యకు శాశ్వత వైకల్యం కలిగించాడని పోలీసులు అభియోగాలు మోపారు.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







