హూప్స్.! తమన్నాకి ఆ ‘సూపర్’ ఛాన్స్ మిస్ అయినట్లేనా.?
- August 25, 2022
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘జైలర్’లో మిల్కీ బ్యూటీ తమన్నా పేరు పరిశీలిస్తున్నారంటూ ఈ మధ్య ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తొలిసారి సూపర్ స్టార్‌తో తమన్నా జత కట్టబోతోందనీ తమ్మూ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.
నిప్పు లేనిదే పొగరాదు కదా.. ప్రచారం జరిగిందంటే, అందులో ఎంతో కొంత నిజం వుండకపోదులే.. అని ఎదురు చూశారు తమ్మూ ఫ్యాన్స్. అయితే, లేటెస్టుగా ‘జైలర్’ సినిమాకి సంబంధించి కొంతమంది కాస్టింగ్ వివరాలను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
అందులో మిల్కీ బ్యూటీ తమన్నా పేరు లేకపోవడంతో డిజప్పాయింట్ అయ్యారు తమన్నా అభిమానులు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కమెడియన్‌గా యోగిబాబు పేరు ప్రకటించారు. అలాగే, తమిళ నటి రమ్య పాండియన్, మలయాళ నటుడు వినాయకన్ మరియు వసంత్ రవి తదితరుల పేర్లను ఓ వీడియో క్లిప్పింగ్ ద్వారా రివీల్ చేశారు.
కట్ చేస్తే, తమన్నా పేరు ఇందులో లేదు. అసలు లీడ్ హీరోయిన్ పేరునే ప్రకటించలేదు చిత్ర యూనిట్. అంటే, తమన్నా పేరు హోల్డ్‌లో వుందా.? లేక అసలు లేదా.? అనేది తెలియడం లేదు. మొత్తానికి ఇప్పటికైతే, సూపర్ స్టార్‌తో తమన్నా జోడీ కుదరనట్లే మరి.
అన్నట్లు మెగాస్టార్‌తో తమన్నా ‘భోళా శంకర్’ సినిమా కోసం జోడీ కడుతున్న సంగతి తెలిసిందే కదా.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







