ఆ విషయం ‘కరణ్’ షోలో చెప్పననేసిన కియారా అద్వానీ.!
- August 25, 2022
బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ హోస్ట్‌గా సాగే ‘కాఫీ విత్ కరణ్ షో’ గురించి అందరికీ తెలిసిందే. అడల్ట్ షోగా దీన్ని వ్యాఖ్యానిస్తుంటారు చాలా మంది. ఇక్కడ చర్చకొచ్చే అంశాలన్నీ ఆ స్థాయిలోనే వుంటాయ్ మరి.
ప్రముఖ సెలబ్రిటీల పర్సనల్, అండ్ ప్రయివేట్ విషయాల్లోకి తల దూర్చి, వారిని ఇరకాటంలో పడేసి మరి, వారి నుంచి ఇంట్రెస్టింగ్ ఇష్యూస్‌ని బయటికి తెస్తుంటాడు కరణ్ జోహార్ ఈ షో సందర్భంగా.
ఆ తర్వాత ఆ అంశాలు తెగ వైరల్ అవుతుంటాయ్. అలాగే వివాదాస్పదం కూడా అవుతుంటాయ్. తాజాగా కరణ్ షోలో ‘భరత్’ బ్యూటీ కియారా అద్వానీ జాయిన్ అయ్యింది. ఆమె లవ్ ఎఫైర్లు, పెళ్లి.. తదితర అంశాలు ఈ షోలో చర్చకొచ్చాయ్.
కానీ, కియారా అద్వానీ మాత్రం ఎక్కడా జంకకుండా ఆచి తూచి వ్యవహరించింది. ఎలాంటి లీకేజీలు ఇవ్వకుండా జాగ్రత్త పడింది. కానీ, పెళ్లి విషయానికి వచ్చేసరికి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా రెస్పాండ్ అయ్యింది కియారా అద్వానీ.
తన లైఫ్‌లో పెళ్లి అనేది చాలా బ్యూటిఫుల్ మూమెంట్. ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. వివాహ వ్యవస్థను తాను చాలా నమ్ముతానని చెబుతూ, అందుకు ఇంకా సమయం వుందని దాటేసింది. అంతకన్నా ఎక్కువగా ఈ షోలో అస్సలు మాట్లాడను.. అని తెగేసి చెప్పేసింది. ఏం మాట్లాడితే ఏం వివాదాస్పదం అవుతుందో అని కియారా ముందే గ్రహించేసినట్లుంది కాబోలు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







