49వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ UU లలిత్

- August 27, 2022 , by Maagulf
49వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ UU లలిత్

న్యూ ఢిల్లీ: భారతదేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణస్వీకారం చేశారు.శనివారం (ఆగస్టు 27,2022) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. యూయూ లలిత్‌తో ప్రమాణం చేయించారు. జస్టియ్‌ యూయూ లలిత్‌ పదవీ కాలం నవంబర్ 8న ముగియనుంది. అంటే 74 రోజులు మాత్రమే ఆయన సీజేఐగా కొనసాగనున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. సీజేఐ ఎన్వీ రమణ పదవీ విరమణ చేయటంతో ఆయన స్థానంలో యూయూ లలిత్ సీజేఐగా నియమితులయ్యారు. నవంబర్ 8న లలిత పదవీ విరమణ చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్కర్‌, కేంద్ర మంత్రులు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, జస్టిస్‌ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు.

సీజేఐ ఎన్వీ రమణ పదవీ విరమణ సందర్భంగా మాట్లాడిన జస్టిస్‌ లలిత్‌.. దేశంలోని కేసుల జాబితా, అత్యవసర వ్యవహారాల ప్రస్తావన, రాజ్యాంగ ధర్మాసనాలు అనే మూడు ప్రధాన అంశాలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. గతంలో పలు కీలక తీర్పులో జస్టిస్ యూయూ లలిత్ వెల్లడించారు. ఉదయ్ యు లలిత్ మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జన్మించారు . అతని తాత, రంగనాథ్ లలిత్ కూడా మహాత్మా గాంధీ,జవహర్‌లాల్ నెహ్రూ షోలాపూర్ సందర్శించినప్పుడు రెండు వేర్వేరు పౌర రిసెప్షన్‌లకు అధ్యక్షత వహించిన న్యాయవాది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com