చెన్నై-దుబాయ్ విమానానికి బాంబు బెదిరింపు
- August 27, 2022
చెన్నై: చెన్నై నుంచి శనివారం ఉదయం దుబాయ్ వెళ్లే ప్రైవేటు విమానానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దుబాయ్ వెళ్లే ప్రైవేటు విమానంలో బాంబు ఉందంటూ చెన్నై పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ కాల్ రావడంతో్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.చెన్నై పోలీస్ కంట్రోల్ రూంకు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి శనివారం ఫోన్ కాల్ వచ్చింది.దీంతో పోలీసులు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని కనుగొనడానికి విచారణ ప్రారంభించారు. విమానంలో బాంబు కాని పేలుడు పదార్థాలు కాని అమర్చారా అనే విషయాన్ని నిర్ధరించడానికి పోలీసులు తనిఖీలు ప్రారంభించారు.తదనంతరం 160 మంది ప్రయాణికులతో శనివారం ఉదయం 7.20 గంటలకు చెన్నై నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఇండిగో విమానం లోపల భద్రతా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!







