భర్తని క్రూరంగా హత్య చేసిన భారతీయ మహిళకు జైలుశిక్ష
- April 15, 2016
బహ్రెయిన్ లో 27 ఏళ్ల ఒక భారతీయ మహిళ తన పిల్లల ముందు భర్తని 72 సార్లు కత్తిపోట్లు పొడిచి చంపిన దోషిగా నిర్ధారించి సుప్రీం అప్పీల్స్ న్యాయస్థానం ఆమెకు జీవిత ఖైదు విధించింది.
40 ఏళ్ల భర్త ను దారుణంగా హత్య చేసిన ఆ మహిళకు విదేశాలలో నివసిస్తున్న మరొక వ్యక్తి తో ప్రేమలో పడింది. ఫోరెన్సిక్ డాక్టర్ నివేదిక ప్రకారం హంతకి తన భర్తని పంటిగాట్లు కత్తి గాయాలతో అంతమొందించింది. మృతుని శరీరం అంతటా 74 గాయాలు ఉండటంతో మరణానికి కారణమైనట్లు తేలింది.
తొలుత ఈ హంతకి తన భర్త ఆర్థిక సమస్యల కారణంగా మెడ, ఛాతీ మరియు ఉదరం భాగాలలో తానే స్వయంగా కత్తిపోట్లు పొడుచుకొని తన సొంత జీవితం అంతం చేసుకోన్నాడని ఆరోపించింది .
అయితే, ఈ కేసులో అనూహ్యంగా ఆమె ఐదు ఏళ్ల కుమార్తె తన తల్లె...తండ్రిని హత్య చేసినట్లు పోలీసులకు తెలిపింది. తమ తల్లి తండ్రి ప్రతి రోజు కొట్లాడుకుంటారని తెలియచేస్తూ...అమ్మ తన తండ్రిని కత్తిపోట్లు పొడవడం కళ్ళారా చూసేనని సాక్ష్యం ఇవ్వడంతో ఆ హంతకిని పోలీసులు అరెస్టు చేశారు.
తన తండ్రి...తమ తల్లి కత్తి దాడి ఆపడానికి, తన జీవితం యొక్క చివరి నిమిషం వరకు తన భార్యని ఎంతో ప్రాధేయపడ్డారు అని తెలిపింది కానీ ఆ హంతకురాలు అతని మెడను కత్తితో వేరుచేయడంతో అతని ప్రాణం పోయింది.
హంతకురాలి కుమార్తె యొక్క ఒప్పుకోలు ప్రకారం , ఫోరెన్సిక్ డాక్టర్ యొక్క నివేదిక మరియు నేరం చేయడానికి వాడబడిన కత్తి, సన్నివేశం నుండి సేకరించిన సాక్ష్యాధారాలు, ఆధారంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ హత్య ఉద్దేశ్యపూర్వకంగా చేసినట్లు నిర్ధారించారు.
హాస్యాస్పదంగా , కట్టుకోన్నవాడీనే కడ తేర్చిన ఆ స్త్రీ కేసుని తప్పు దోవ పట్టించడానికి విఫలయత్నం చేసింది. తన భర్త ఆత్మహత్య చేసుకొంటున్న సమయంలో తాను ఎంతగానో ఆయనను నిరోధించడానికి ప్రయత్నం చేసానని...ఆ సమయంలో తనకూ కొన్ని గాయాలు అయ్యాయని నమ్మచూపబోయంది.
కానీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం ఒక మనిషి తన ఆత్మహత్యాయత్నం క్రమంలో ఈ పద్ధతిలో తనను తాను బాధించుకోవడం అసాధ్యమని పేర్కొంటూ ఆ హంతకి ఆరోపణలను తోసిపుచ్చారు.
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









