పోగొట్టుకున్న వస్తువులు ఇంటి వద్దకే.. షార్జా పోలీసులు
- August 29, 2022
యూఏఈ: పోగొట్టుకున్న వస్తువులను ఇంటివద్దనే అందజేసేందుకు షార్జా పోలీసులు కొత్త సర్వీసును ప్రారంభించారు. దీని ద్వారా పోగొట్టుకున్న, దొరికిన వస్తువులు ఇప్పుడు మీ ఇంటి వద్దకే పోలీసులు తీసుకొచ్చి అందజేయనున్నారు. షార్జా పోలీస్‌లోని సమగ్ర పోలీస్ స్టేషన్ల విభాగం డైరెక్టర్ కల్నల్ యూసఫ్ బిన్ హర్మౌల్ మాట్లాడుతూ.. కొత్త సర్వీసుకు సంబంధించి మొదటి దశ అమలు విజయవంతంగా సాగుతుందన్నారు. ఇప్పటివరకు 97 శాతం సక్సెస్ రేటును సాధించిందన్నారు. ఒసోల్ స్మార్ట్ అప్లికేషన్స్ కంపెనీ (బురాక్) సహకారంతో కొత్త సర్వీసును గత జూన్‌లో ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. షార్జా పోలీసులు తమ లక్ష్యాలను సాధించడానికి, సమాజంలోని సభ్యుల జీవన నాణ్యతను పెంపొందించడానికి తమ ప్రయత్నాలను తీవ్రతరం చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







