దుబాయ్ లో లగ్జరీ విల్లా కొనుగోలు చేసిన ముకేశ్ అంబానీ..
- August 29, 2022
దుబాయ్: అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రపంచంలోని పలు దేశాల్లో విశాలమైన నివాసాలను కొనుగోలు చేస్తున్నారు.ఇప్పటికే పలు దేశాల్లో ముకేశ్ కుటుంబానికి లగ్జరీ హౌస్‌లు ఉన్నాయి.గత ఏడాది బ్రిటన్‌లో ఓ విశాల సౌధాన్ని ముకేశ్ కుటుంబం కొనుగోలు చేసింది.అదే విధంగా లండన్‌లో బకింగ్‌హాంషైర్ వద్ద ఉన్న 300 ఎకరాల్లోని స్టోక్ పార్క్ ను రూ.592 కోట్లతో ముకేశ్ కుటుంబం కొనుగోలు చేసింది. అయితే దీన్ని ముకేశ్ పెద్ద కుమారుడు ఆకాశ్ కోసం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
కుమార్తె ఆశా అంబానీ కోసం న్యూయార్క్‌లో ఇల్లు వెతుకుతున్నట్లు ప్రచారంలో ఉంది.తాజాగా దుబాయ్‌లో ఓ లగ్జరీ విల్లాను ముకేశ్ అంబానీ కుటుంబం కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.తన చిన్న కుమారుడు అనంత్ కోసమట. ఈ లగ్జరీ విల్లా అరబ్ నగరం దుబాయిలోని సుమద్ర తీరంలో రూ.640 కోట్లతో కొనుగోలు చేసినట్లు బ్లూమ్ బర్గ్ కథనం వెల్లడించింది. అయితే దుబాయ్ లో అదే అతిపెద్ద రెసిడెన్షియల్ ప్రాపర్టీ డీల్ అని సమాచారం. ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ లగ్జరీ విల్లాను ముకేశ్ అంబానీ కొనుగోలు చేశారట.కానీ ఈ సమాచారం బయటకు పొక్కకుండా అత్యంత గోప్యంగా ఉంచారు.
లగ్జరీ విల్లా కొనుగోలు చేసిన ప్రాంతంలోనే ఓ బీచ్ కూడా ఉంటుందట.ఇందులో 10 పడకగదులు, ప్రైవేట్ స్పా, ఇండోర్, అవుట్ డోర్, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం ముకేశ్ కుటుంబం కొనుగోలు చేసిన లగ్జరీ విల్లా పక్కనే బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నివాసంతో పాటు బ్రిటీష్ మాజీ ఫుట్బాల్ స్టార్ డేవిడ్ బెక్ హమ్ నివాసం ఉంది.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







