‘అందాల’ విలనిజం: ఫ్యాన్స్‌కి షాక్ ఇస్తానంటోన్నఐశ్వర్య రాయ్.!

- August 29, 2022 , by Maagulf
‘అందాల’ విలనిజం: ఫ్యాన్స్‌కి షాక్ ఇస్తానంటోన్నఐశ్వర్య రాయ్.!

కాస్త అందంగా వున్నానని ఏ అమ్మాయి అయినా ఫీలైతే చాలు.. నువ్వేమైనా ఐశ్వర్యా రాయ్ అనుకుంటున్నావా.? అనేవాళ్లు. అందమైన అమ్మాయ్ అంటే అది ఐశ్వర్యా రాయ్ మాత్రమే. అందం ఆమె సొంతం. అందానికి కేరాఫ్ అడ్రస్ ఐశ్వర్యా రాయ్. 

పెళ్లయ్యి, పిల్లల తల్లి అయినా కానీ, ఆ క్రేజ్‌లో ఐశ్వర్య రాయ్‌ని కొట్టేవాళ్లే లేరింతవరకూ. అందాల దేవతలా ఆరాధిస్తుంటారు కుర్రోళ్లు ఐశ్వర్యా రాయ్‌ని. అలాంటి తమ అందాల ఆరాధ్య దేవత ఈవిల్‌గా మారిపోతే.?

మీకు అర్ధమవుతోందా.? ఐశ్వర్యా రాయ్ విలన్‌గా మారితే తట్టుకోగలరా.? అందమే కాదు, రకరకాల హావ భావాలు పూయించిన బరువైన పాత్రల్లోనూ ఐశ్వర్యా రాయ్ టాలెంట్ చూశాం. 

నటిగా అనేక రకాల ఛాలెంజింగ్ రోల్స్ చేయాల్సి వుంటుంది. ఆ ఛాలెంజ్‌లో భాగంగానే ఐశ్వర్యా రాయ్ విలన్‌గా మారబోతోందన్న వార్తలు వినిపిస్తున్నాయ్. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘పొన్నియన్ సెల్వన్ 1’ కోసం ఐశ్వర్యా రాయ్ విలన్ అవతారమెత్తబోతోందట. 

విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష తదితర స్టార్ హీరోయిన్ల కలయికలో భారీ మల్టీ స్టారర్ చిత్రంగా రూపొందుతోన్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఐశ్వర్యా రాయ్ రెండు వేరియేషన్స్ వున్న పాత్రలో కనిపించనుందట. అందులో ఒకటి నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రనీ ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి, ఈ ప్రచారంలో నిజమెంతో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com