‘కార్తికేయ 2’కు అభినందనలు తెలిపిన గుజరాత్ ముఖ్యమంత్రి.!

- August 30, 2022 , by Maagulf
‘కార్తికేయ 2’కు అభినందనలు తెలిపిన గుజరాత్ ముఖ్యమంత్రి.!


గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ‘కార్తికేయ 2’ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. సినిమా చాలా బాగుందని కొనియాడారు. కృష్ణ తత్వం గురించి సినిమాల చాలా చక్కగా చూపించారనీ ‘కార్తికేయ 2’ టీమ్‌ని అభినందించారు భూపేంద్ర పటేల్.

నిఖిల్ సిద్డార్ద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన ‘కార్తికేయ 2’ సినిమా ఆగస్టు 13న రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. కటౌట్‌తో సంబంధం లేకుండా కంటెంట్ రిచ్ మూవీగా విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది ‘కార్తికేయ 2’ సినిమా.

నిఖిల్ కెరీర్‌లో బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకున్న సినిమాగా ‘కార్తికేయ 2’ నిలిచింది. అనూహ్యంగా ఈ సినిమా నార్త్ జనాల్ని బాగా ఆకట్టుకుంటోంది. విడుదలై ఇన్ని వారాలు గడిచినా ఇంకా ధియేటర్లలో రన్ అవుతోంది. ఈ మధ్య వస్తున్న సినిమాలన్నీ కేవలం ఒక్క వారానికే పరిమితమవుతుండగా, ‘కార్తికేయ 2’ మాత్రం సక్సెస్‌ఫుల్‌గా గత మూడు వారాలుగా రన్ అవుతూనే వుంది. 

సినిమా సక్సెస్ ప్రమోషన్స్‌లో భాగంగా నిఖిల్ అండ్ టీమ్ తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రిని కలిశారు. ఈ మీటింగ్ సందర్భంగానే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పై విధంగా కార్తికేయ టీమ్‌ని అభినందించారు. అన్నట్లు ఈ సినిమాలో కొంత భాగం గుజరాత్‌లోనూ షూటింగ్ చేయడం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com