విజయ్‌కి క్షమాపణలు తెలిపిన ముంయ్ ధియేటర్ యజమాని.!
- August 30, 2022
‘మా సినిమాని బాయ్‌కాట్ చేసుకోండి..’ అంటూ ‘లైగర్’ ప్రమోషన్లలో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యల కారణంగానే ‘లైగర్’ సినిమా ఫ్లాప్ అయ్యిందనీ, విజయ్ ఆటిట్యూడ్ వల్లనే ధియేటర్లకు జనం రావడం లేదనీ, దాంతో మేం దారుణంగా నష్టపోయామనీ ముంబయ్‌లో ఓ సీనియర్ ధియేటర్ యజమాని మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే.
విజయ్ ఆటిట్యూడ్‌ని తప్పు పడుతూ, అహంకారి అంటూ అభివర్ణించారు సదరు ధియేటర్ యజమాని మనోజ్. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయ్. దాంతో తాజాగా విజయ్ దేవరకొండ సదరు ధియేటర్ యజమానిని కలిశారు.
తన మాటలను అపార్ధం చేసుకున్నారనీ, తన వుద్దేశ్యం అది కాదనీ వివరణ ఇచ్చుకున్నారు. దాంతో, విజయ్‌ని అర్ధం చేసుకున్న మనోజ్, విజయ్‌కి క్షమాపణలు తెలిపారు. తన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. అంతేకాదు, విజయ్ చాలా మంచి వ్యక్తి అనీ, విజయ్ ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటున్నాననీ మనోజ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
విజయ్ దేవరకొండని స్టార్‌గా నిలబెట్టిందే అతని ఆటిట్యూడ్. ఆ ఆటిట్యూడే ఆయనకు అంతలా ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. అదే ఆటిట్యూడ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ కొంప ముంచేసిందంటూ, ఈ వ్యాఖ్యలతో విజయ్ యాంటీ ఫ్యాన్స్ కొందరు ట్రోల్ చేశారు. తాజా ఎపిసోడ్‌తో ఆ ట్రోల్స్‌కి చెక్ పడడంతో పాటూ, విజయ్‌పై పడిన మచ్చ కూడా తొలిగిపోయినట్లైంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







