రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ లో ఉద్యోగాలు...
- August 30, 2022
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్‌లో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన 20 ఇంజినీర్ (ఎలక్ట్రికల్/మెకానికల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఈ/బీటెక్/ఇంజినీరింగ్‌లో బీఎస్సీ/ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/మెకానికల్ ఇంజినీరింగ్/ప్రొడక్షన్ ఇంజినీరింగ్/ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్/ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.అభ్యర్ధుల వయసు 40 యేళ్లకు మించకుండా ఉండాలి.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.42,478లతోపాటు ఇతర అలవెన్సులు కూడా కల్పిస్తారు.ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 19, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.rites.com/పరిశీలించగలరు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







