సరిహద్దు అంశం పైనే భారత్-చైనా సంబంధాలు ఆధారపడి ఉంటాయి: విదేశాంగ మంత్రి జైశంకర్
- August 30, 2022
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులో ఉన్న పరిస్థితి ఆధారంగానే, ఇరు దేశాల మధ్య సంబంధాలు ఆధారపడి ఉంటాయన్నారు భారత విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి జైశంకర్.
న్యూఢిల్లీలో ఏర్పాటైన ఆసియా సొసైటీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భారత్-చైనా సంబంధాలపై మాట్లాడారు. ''భారత్-చైనా దేశాల మధ్య సరిహద్దులో ఉన్న పరిస్థితిని బట్టే, ఇరు దేశాల సంబంధాలు ఆధారపడి ఉంటాయి. గతంలోలాగా రెండు దేశాల మధ్య సానుకూలత, స్థిరత్వం ఏర్పడాలంటే మూడు అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. 'పరస్పర సున్నితత్వం, పరస్పర గౌరవం, పరస్పర ఆసక్తు'ల మీదే సంబంధాలు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాల గురించి అందరికీ తెలిసిందే'' అని జై శంకర్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో భారత్-చైనా సంబంధాల మీదే ఆసియా అభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు.
అభివృద్ధిలో ప్రస్తుత ట్రెండ్ కొనసాగుతుందని భావిస్తున్నట్లు జై శంకర్ చెప్పారు. ఇదే కార్యక్రమంలో ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రడ్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







