ప్రవాసులకు 30వేల కొత్త వర్క్ వీసాలు..
- August 31, 2022
కువైట్ సిటీ: కువైట్ గత కొంత కాలంగా వలసదారులకు జారీ చేసే వర్క్ వీసాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇంతకుముందులా భారీ సంఖ్యలో వర్క్ వీసాలు ఇవ్వడం లేదు. వర్క్ పర్మిట్ల విషయంలో ఎన్నో షరతులు విధిస్తోంది.ఇదిలా ఉంటే..గత ఏడాది కాలంగా ప్రవాసులకు జారీ చేసిన వర్క్ వీసాల వివరాలను తాజాగా పబ్లిక్ అథారిటీ మ్యాన్‌పవర్‌కు చెందిన ఇన్ఫర్మేషన్ సీస్టం సెంటర్ ఆపరేషన్స్ చీఫ్ బష్రా సెలీం వెల్లడించారు.వర్క్ వీసాల జారీ కోసం తీసుకొచ్చిన కొత్త మెకానిజం ఆషల్ ద్వారా కొత్తగా 30వేల వర్క్ పర్మిట్లను జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే 1.27 మిలియన్ల వర్క్ వీసాలను పునరుద్ధరించినట్లు తెలిపారు.కొత్త మెకానిజాన్ని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్‌తో లింక్ చేయడం ద్వారా వర్క్ వీసాల జారీ మరింత సులభతరంగా మారిందని బష్రా చెప్పారు. అటు దేశంలోని యువతకు ఉద్యోగ అవకాశాల కోసం ప్రత్యేక ఆటోమెటిక్ విధానాన్ని అభివృద్ధి చేసినట్లు సంబంధిత అధికారి అల్ ముతైరీ వెల్లడించారు.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







