ఈ ఏడాది 15 వేలమంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్

- September 03, 2022 , by Maagulf
ఈ ఏడాది 15 వేలమంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్

కువైట్: ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటి వరకు కువైట్‌లోని విదేశీయుల నివాస చట్టంలోని ఆర్టికల్ 16ను ఉల్లంఘించిన 15,000 మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్లు, మాల్స్, వ్యాపార కేంద్రాలలో భద్రతా తనిఖీలు నిరంతరం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నివాస చట్ట నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రవాసుల నివాసం చెల్లుబాటు అయినప్పటికీ  వారు చట్టాలను ఉల్లంఘించే చర్యలకు పాల్పడితే దేశం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. దేశంలోని లేబర్ మార్కెట్ మార్జినల్ వర్కర్లను నియంత్రించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com