యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ కు ప్రధాని మోడీ లేఖ
- September 03, 2022
యూఏఈ: ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాశారు. తమ దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడం, ఇరువురి ఉమ్మడి ప్రయోజనాల కోసం పలు అంశాల్లో కలిసి పనిచేయాలని ఆ లేఖలో ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. యూఏఈ-ఇండియా జాయింట్ కమిటీ పద్నాలుగో సెషన్, యూఏఈ మూడవ సెషన్లో పాల్గొనడానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ వచ్చారు. ఈ సందర్భంగా అల్ షాతి ప్యాలెస్లో షేక్ మొహమ్మద్ తో సమావేశమై భారత ప్రధాని రాసిన లేఖను అందజేశారు. భారతదేశం, అక్కడి ప్రజలు మరింత అభివృద్ధి, శ్రేయస్సును కాంక్షిస్తూ ప్రధాని మోదీకి UAE అధ్యక్షుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో తమ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. UAE-భారత్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా పరస్పర ఆందోళనకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా ఇరువురు చర్చించారు. ఈ సమావేశానికి విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయ సహకార మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అధ్యక్ష వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ప్రత్యేక వ్యవహారాల సలహాదారు షేక్ మహ్మద్ బిన్ హమద్ బిన్ తహ్నౌన్ అల్ నహ్యాన్ హాజరయ్యారు. అంతర్జాతీయ సహకార శాఖ సహాయ మంత్రి రీమ్ బింట్ ఇబ్రహీం అల్ హషేమీ, యూఏఈ అధ్యక్షుని దౌత్య సలహాదారు డాక్టర్ అన్వర్ గర్గాష్, భారత ప్రతినిధి బృందం పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







