టూరిస్ట్ వీసా హోల్డర్లు హజ్ చేయలేరు: సౌదీ
- September 03, 2022
జెడ్డా: టూరిస్ట్ వీసా హోల్డర్లు హజ్ సీజన్‌లో ముందస్తుగా హజ్ చేయడానికి లేదా ఉమ్రాను చేయడానికి అనుమతించదని, ఈ మేరకు పర్యాటక వీసా నిబంధనలకు సవరణ చేసినట్లు సౌదీ పర్యాటక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కొత్తగా సవరించిన టూరిస్ట్ వీసా విధానం ప్రకారం.. పర్యాటకులు సౌదీలో ఉన్న సమయంలో నిబంధనలు, భద్రతా సూచనలను పాటించవలసి ఉంటుందని పేర్కొంది. అలాగే గుర్తింపు పత్రాలను ఎల్లవేళలా తమవెంట పెట్టుకోవాలని సూచించింది. GCC రెసిడెన్సీని కలిగి ఉన్నవారు ఇ-టూరిస్ట్ వీసాపై సౌదీలోకి ప్రవేశించవచ్చని మంత్రిత్వ శాఖ వివరించింది. రెసిడెన్సీ కనీసం మూడు నెలల పాటు చెల్లుబాటులో ఉండాలని తెలిపింది. అతనితో పాటు వచ్చే ఫస్ట్-క్లాస్ వీసా హోల్డర్ బంధువులకు, వారి స్పాన్సర్‌లతో వచ్చే గృహ కార్మికులకు కూడా వర్తిస్తుందని తెలిపింది. గురువారం సౌదీ అరేబియా GCC దేశాల నివాసితులు evisa కోసం దరఖాస్తు చేసుకోవడానికి.. యూకే, యూఎస్, ఈయూ నివాసితులు వీసా ఆన్ అరైవల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించే కొత్త నిబంధనలను ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







