ప్రయాణికుల కోసం టిఎస్ఆర్టీసీ మరో ఆఫర్
- September 03, 2022
హైదరాబాద్: టిఎస్ఆర్టీసీ ప్రయాణికుల కోసం మరో రాయితీని ప్రకటించింది. హైదరాబాద్ – విజయవాడ, హైదరాబాద్–బెంగళూరు వెళ్లే గరుడ, రాజధాని సర్వీసుల ఛార్జీలను ఈ నెలాఖరు వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ రెండు మార్గాల్లో నడిచే అంతర్రాష్ట్ర బస్సులు అంటే గరుడ ప్లస్, రాజధాని సర్వీసులలో శుక్రవారం, ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లో టిక్కెట్టు ఛార్జీలో 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు.బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే బస్సులకు శుక్రవారం, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే సర్వీసుల్లో ఆదివారం తగ్గింపు వర్తించదని స్పష్టం చేసింది. ఈ రాయితీ ఛార్జీలు ఈ నెల 30 వరకు వర్తించనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







