నూతన టూరిజం ఈవెంట్ ను ప్లాన్ చేసిన బహ్రెయిన్
- September 04, 2022
మనామా: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రేమికులను ఆకట్టుకునే ప్రయత్నం లో భాగంగా బహ్రెయిన్ పర్యాటక శాఖ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
మనామా సౌక్‌లో 10 రోజుల పాటు జరిగే హెరిటేజ్ ఈవెంట్‌ను నిర్వహించే ప్రణాళికలను గురించి బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) ప్రకటించింది.
ఈ "రోడ్ టు మనామా" BTEA ద్వారా సెప్టెంబర్ 22 - అక్టోబర్ 1 సాయంత్రం వేళల్లో నిర్వహించబడుతుంది. పిల్లలు మరియు యుక్తవయస్కులకు సాంప్రదాయ బహ్రెయిన్ క్రాఫ్ట్‌లను పరిచయం చేయడానికి మరియు వాటిని ఎలా నేర్చుకోవాలో నేర్పడానికి రూపొందించిన వివిధ వర్క్‌షాప్‌లు ఇందులో ఉంటాయి.
రోడ్ టు మనామాతో పాటు సాంప్రదాయ బహ్రెయిన్ గేమ్‌లు, సంగీత ప్రదర్శనలు, పిల్లల కథలు చెప్పడం వంటి అనేక పబ్లిక్ ఈవెంట్లు ఉంటాయి. సౌదీ జాతీయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 22 - 24 తేదీలలో తోలుబొమ్మల ప్రదర్శన నిర్వహించబడుతుంది అని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం