కువైట్ లో 'గల్ఫ్' పాట

- April 15, 2016 , by Maagulf

గల్ఫ్ జీవితాల నేపద్యం లో శ్రావ్య ఫిల్మ్స్ నిర్మిస్తున్న గల్ఫ్ చిత్రం మూడవ పాట ఆడియో తీజర్ శుక్రవారం కువైట్ లో రియా లోని ఇంటర్నేషనల్ ఆర్ట్స్ అకాడమీ లో ప్రముఖల సమక్షంలో జరిగింది.లిరిక్ మాస్టర్ జి గారు పాట రాయగా ప్రవీణ్ ఇమ్మడి స్వరపరిచిన ఈ చిత్రానికి సంబంధించిన పాటల్లో మూడో  పాటను, టీజర్ ను శుక్రవారం కువైట్ లో ఆవిష్కరించారు. 

కువైట్ తలుగు కళా సమితి అధ్యక్షుడు వెంకట్ కోడూరి ఆధ్వర్యంలో ప్రముఖ కువైట్ వ్యాపారవేత్త మిషాప్ అల్ సలీం ముఖ్య అతిధిగా సుధాకర్ రావు కుదరవల్లి,మోహన్ బాబు,గిరి ప్రసాద్,తాడూరి శ్రీరామ్,శ్రీనివాస్ కుమార్,నాగేంద్ర బాబు మరియు చిత్ర దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి అతిధిలుగా వ్యవహించారు.మస్కట్ లో తొలి పాట తీజర్ ని దుబాయ్ లో రెండవ పాట కువైట్ లో మూడో తీజర్ విడుదల చెయ్యబడింది.

ఈ సినిమాలో కధానాయకుడు, నాయికలుగా కొత్తవారు నటిస్తుండగా ఇతర పాత్రల్లో తనికెళ్ళ భరణి, ఎల్.బి.శ్రీరాం, నాగినీడు, జబర్దస్త్ వేణు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై లో విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్.వి.శివరాం, సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి,నిర్మాత వై.రవీంద్ర బాబు,సహ నిర్మాత డా.యల్.యన్ రావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి.బాపిరాజు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com