ఇ-పాస్‌పోర్ట్‌లు ప్రవేశ పెట్టనున్న భారత్

- September 05, 2022 , by Maagulf
ఇ-పాస్‌పోర్ట్‌లు ప్రవేశ పెట్టనున్న భారత్

న్యూ ఢిల్లీ: భారత ప్రభుత్వం త్వరలో ఇ-పాస్‌పోర్ట్‌లు ప్రవేశపెట్టనుంది.నకిలీ బెడదను నియంత్రించేందుకు..డేటా సంరక్షణకై ఇ పాస్‌పోర్ట్‌లు అందుబాటులో రానున్నాయి.

నకిలీ పాస్‌పోర్ట్‌లు దేశ సమగ్రతకే ప్రమాదకరంగా మారుతున్నాయి.నకిలీలతో దేశం దాటి పోతున్న నేరస్థులు చాలామందున్నారు.అదే విధంగా దేశాలు దాటి వస్తున్నవాళ్లున్నారు. ఈ క్రమంలో నకిలీ పాస్‌పోర్ట్‌లను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇ-పాస్‌పోర్ట్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. 

పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్టులో బాగంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో ఇ-పాస్‌పోర్ట్‌లు ప్రవేశపెట్టనుంది.చాలాకాలం నుంచి ఇ-పాస్‌పోర్ట్‌ల గురించి చర్చ నడుస్తున్నా..ఎప్పుడు వస్తాయనే విషయంపై ఇన్నాళ్లూ సందిగ్దత నెలకొంది.ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై స్పష్టత ఇచ్చింది.ఇ-పాస్‌పోర్ట్‌లను త్వరలో అంటే ఏడాది చివరికి జారీ చేయనున్నట్టు వెల్లడించింది.

ఇ-పాస్‌పోర్ట్‌ల వల్ల నకిలీ పాస్‌పోర్ట్‌ల బెడద తగ్గనుంది.మరోవైపు పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నప్పుడు విలువైన వ్యక్తిగత సమాచారం ఇతరులకు చిక్కే అవకాశముంది.ఈ పరిస్థితి ఇక పై ఉండదు.పాస్‌పోర్ట్ ఎక్కడైనా పోగొట్టుకునే పరిస్థితి ఉండదు.అంతర్జాతీయ ప్రయాణాలు సులభతరం కావడమే కాకుండా..పాస్‌పోర్ట్ కలిగిన వ్యక్తుల డేటా సురక్షితంగా ఉండనుంది. నకిలీకు అడ్డుకట్టు పడుతుంది.ఈ ఏడాది చివరి నాటికి ఇ-పాస్‌పోర్ట్‌లు జారీ చేస్తామని..పాస్‌పోర్ట్ విభాగంలో సంస్కరణలతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ఇ పాస్‌పోర్ట్‌లు ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. 

ఇ-పాస్‌పోర్ట్‌లు ఎలా పని చేస్తాయి...

వాస్తవానికి ఇ-పాస్‌పోర్ట్ అనేది కొత్తది కాదు.ఇప్పటికే 100కు పైగా దేశాలు అవలంభిస్తున్నాయి. ఇప్పుడున్న పాస్‌పోర్ట్‌లానే ఇ పాస్‌పోర్ట్ ఉంటుంది. డేటా భద్రత, విదేశాల్లో ఇమిగ్రేషన్ ప్రక్రియ సులభతరమయ్యేందుకు ఎలక్ట్రానిక్ చిప్ నిక్షిప్తం చేస్తారు.ఈ చిప్‌లో సంబంధిత వ్యక్తి,పేరు, చిరునామా, పుట్టినతేదీ, వయస్సు వంటి కీలక వివరాలుంటాయి.ఇదొక రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ చిప్.వెనుక చిన్న యాంటినా ఉంటుంది. ఫలితంగా ప్రయాణీకుడి వివరాల్ని వేగంగా వెరిఫై చేయవచ్చు. దేశం దాటి అక్రమంగా వచ్చేవారిని, దేశం దాటిపోయే నేరస్థుల్ని నియంత్రించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com