హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన వివాదం..

- September 06, 2022 , by Maagulf
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన వివాదం..

హైదరాబాద్: హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన వివాదం ఉద్రికత్తకు దారితీసింది. హుస్సేన్ సాగర్‌లో మట్టి గణపతి విగ్రహాలనే మాత్రమే నిమజ్జనం చేయాలంటూ గతంలో ప్రభుత్వం సూచించింది. అయితే, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను కూడా నిమజ్జనం చేసేందుకు అనుమతించాల్సిందేనని భాగ్యనగర్ గణేశ్ ఉత్సక కమిటీ పట్టుబడుతోంది. ఈ క్రమంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు తొమ్మిదో తేదీన హుస్సేన్ సాగర్‌లోనే వినాయక విగ్రహాల నిమజ్జనం చేస్తామని కమిటీ తేల్చి చెప్పింది. పోలీసులు, ప్రభుత్వం తమకు సహకరించాలని.. ఎలాంటి ఉద్రిక్తత జరిగినా అందుకు ప్రభుత్వమే కారణమంటూ కమిటీ అధ్యక్షుడు తెలిపారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయనివ్వకపోతే.. ప్రగతి భవన్‌లో చేస్తామంటూ హెచ్చరించారు.

ఈ తరుణంలో ఈరోజు మంగళవారం గణేశ్ నిమజ్జనంపై ఉత్సవ సమితి కమిటీ సభ్యులు ట్యాంక్‌బండ్‌పై బైక్ ర్యాలీ నిర్వహిస్తామని ట్యాంక్‌బండ్‌ కు చేరుకోగా..వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈరోజు నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ర్యాలీలు, సభలకు అనుమతి లేదని పోలీసులు అడ్డుగించారు. దాంతో పోలీసులు, ఉత్సవ కమిటీ సభ్యుల మధ్య తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రస్తుతం పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com