ఢిల్లీ లిక్కర్ స్కామ్.. 35 ప్రాంతాల్లో ఈడీ సోదాలు
- September 06, 2022
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్త దాడులు చేపట్టింది. ఆ కేసుతో లింకు ఉన్న 35 ప్రదేశాల్లో ఈరోజున ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. నిందితుడు సమీర్ మహేంద్రు ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. గురుగ్రామ్, లక్నో, హైదరాబాద్, ముంబయి, బెంగుళూరులోనూ ఈడీ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ మాజీ ఎక్సైజ్ కమీషనర్ అరవ గోపీ కృష్ణ ఇంట్లోనూ ఇటీవల ఈడీ సోదాలు చేపట్టింది. కొత్త అబ్కారీ విధానం అమలు జరగకుండా లిక్కర్ మాఫియా అడ్డుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసులో సీబీఐ ఇచ్చిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు మనీ ల్యాండరింగ్ కేసును బుక్ చేసే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!
- నవంబర్ 25 నుండి అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్..!!
- ఆధునిక సౌకర్యాలతో షువైక్ బీచ్ రెడీ..!!
- న్యూయార్క్ లో సౌదీ, భారత విదేశాంగ మంత్రులు భేటీ..!!
- కనువిందు..బుర్జ్ ఖలీఫాపై కోల్కతా ఫెస్టివల్ థీమ్..!!
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం