కరెంట్ కోత కారణాలపై విచారణ ప్రారంభం
- September 06, 2022
మస్కట్: ఒమన్ లోని సుల్తానేట్ ప్రాంతంలో సోమవారం కరెంట్ కోతలతో ప్రజలు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. చాలా సేపు కరెంట్ పోవటంతో ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పనిచేయలేదు. ఐతే కరెంట్ కోతలకు సాంకేతిక సమస్యలు తలెత్తటమే కారణమని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.ఐతే దీనికి పూర్తి కారణాలు తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు. పబ్లిక్ సర్వీస్ అథారిటీ (PSRA) అధికారులు ఇబ్రీ విద్యుత్ స్టేషన్ ను సందర్శించారు. మెయిన్ కనెక్టెడ్ నెట్ వర్క్ లో తలెత్తిన సమస్య కారణంగానే కరెంట్ సప్లయ్ తో ఇబ్బందులు తలెత్తాయని గుర్తించారు. భవిష్యత్ లో మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను విచారణాధికారులు ప్రభుత్వానికి సూచించనున్నారు.
తాజా వార్తలు
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!
- చట్టవిరుద్ధంగా తొలగింపు.. ఐదుగురు ఉద్యోగులకు పరిహారం..!!