కృష్ణవంశీ. సందీప్ కిషన్ కాంబినేషన్ ...
- April 16, 2016
ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ గా మంచి ఇమేజ్ సంపాదించుకున్న కృష్ణవంశీ పరిస్థితి ఇప్పుడు ఏమంత బాగోలేదు. ముఖ్యంగా మొగుడు, పైసా సినిమాaతో కృష్ణవంశీ క్రియేటివిటీ మీదే అనుమానాలు మొదలయ్యాయి. అయితే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గోవిందుడు అందరివాడేలే మంచి వసూళ్లను రాబట్టడంతో కాస్త పరవాలేదనిపించాడు. కానీ అవకాశాల కోసం మాత్రం చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది.ఫైనల్ గా రుద్రాక్ష పేరుతో ఓ ఫాంటసీ సినిమాను ప్లాన్ చేశాడు కృష్ణవంశీ, అయితే ఈ సినిమా చర్చల దశలో ఉండగానే బాలయ్య వందో సినిమా కోసం పిలుపు రావటంతో రుద్రాక్షను పక్కన పెట్టాశాడు. కానీ బాలయ్య సినిమా కూడా ఫైనల్ కాకపోవటంతో రెండు సినిమాలు ఆగిపోయాయి. దీంతో ఆలోచనలో పడ్డ కృష్ణవంశీ ప్రస్తుతం ఓ కుర్ర హీరోతో సినిమా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడట.యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు కృష్ణవంశీ. సందీప్ కిషన్ కూడా కెరీర్ లో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. దీంతో ఈ ఇద్దరు కలిసి ఓ భారీ హిట్ కొట్టాలని భావిస్తున్నారట. మరి ఈ సినిమానైనా కృష్ణవంశీ సెట్స్ మీదకు తీసుకువస్తాడేమో చూడాలి.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







