ట్రాఫిక్ ఉల్లంఘనలకు Dh3,000 వరకు జరిమానా: యూఏఈ

- September 07, 2022 , by Maagulf
ట్రాఫిక్ ఉల్లంఘనలకు Dh3,000 వరకు జరిమానా: యూఏఈ

యూఏఈ: డ్రైవింగ్ లైసెన్స్ జారీ, ట్రాఫిక్ నిబంధనల అమలు విషయంలో యూఏఈ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అధికారులు తెలిపారు. యూఏఈలో డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంటుందని, మల్టీ అసెస్‌మెంట్‌లను పూర్తి చేసిన వారికే లైసెన్స్ లభిస్తుందన్నారు. దీంతో యూఏఈ రోడ్లపై తమ వాహనాలను నడిపే సమయంలో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అనుసరిస్తారని అధికారులు పేర్కొన్నారు. మాదకద్రవ్యాలు, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి తీవ్రమైన ట్రాఫిక్ నేరాల విషయంలో న్యాయస్థానం నిర్ణయించిన జరిమానాలు, జైలు శిక్షతో పాటు లైసెన్స్ సస్పెండ్‌ అవుతుందన్నారు. డ్రైవింగ్ లైసెన్స్-సంబంధిత ఉల్లంఘనలకు Dh 3,000 వరకు జరిమానా విధించవచ్చని, కొన్ని సందర్భాల్లో వాహనాన్ని సీజ్  కూడా చేయవచ్చన్నారు.

జరిమానాల జాబితా ఇలా..

- అనుమతించబడిన సందర్భాల్లో కాకుండా.. విదేశీయులు డ్రైవింగ్ చేస్తే..  Dh400 జరిమానా

- మంజూరైన లైసెన్స్‌తో కాకుండా ఇతర వాహనాన్ని నడిపితే.. 400 దిర్హామ్ జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు

- గడువు ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్‌తో డ్రైవింగ్ చేస్తే.. 500 దిర్హామ్ జరిమానా, 4 బ్లాక్ పాయింట్లు, వాహనాన్ని 7 రోజుల సీజ్ చేస్తారు.

- లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే.. 400 దిర్హామ్ జరిమానా

- మొదటి ట్రాఫిక్ ఉల్లంఘనలో గరిష్ట బ్లాక్ పాయింట్లు వచ్చినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్‌ను అందజేయడంలో విఫలమైతే.. 1,000 దిర్హామ్ జరిమానా

- రెండవ ట్రాఫిక్ ఉల్లంఘనలో గరిష్ట బ్లాక్ పాయింట్లు వచ్చినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్‌ను అందజేయకపోతే.. 2,000 దిర్హామ్ జరిమానా

- మూడవ ట్రాఫిక్ ఉల్లంఘనలో గరిష్ట బ్లాక్ పాయింట్లు వచ్చినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్‌ను అందజేయడంలో విఫలమైతే.. 3,000 దిర్హామ్ జరిమానా

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com