ఈ నెల 23 న బహ్రెయిన్ లో గర్భా దండియా
- September 07, 2022
బహ్రెయిన్: మూడేళ్ల తర్వాత బహ్రెయిన్ లో మళ్లీ దండియా సందడి మొదలు కానుంది. ఇండియన్ లేడీస్ అసోసియేషన్ (ILA) ఆధ్వర్యంలో ఈ సారి గర్భా నృత్యాలతో పాటు దండియా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 న "గార్భా ని రాత్- గ్రాండ్ దండియా నైట్ -2022" పేరుతో క్రౌన్ ప్లాజా బాల్ రూమ్ లో కార్యక్రమం జరగనుంది.ఇండియన్ లేడీస్ అసోసియేషన్, మెగా మార్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.ఇందులో భారత సాంప్రదాయ నృత్యం, సాంప్రదాయ డప్పు కళలను కూడా ప్రదర్శించనున్నారు.హస్త, చేనేత కళల ఎగ్జిబిషన్ ను కూడా నిర్వహించనున్నట్లు ఐఎల్ఏ తెలిపింది.జ్యువెల్లరీ, ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. బహ్రెయిన్ ఆల్ టైమ్ ఫేవరేట్ డీజే నిర్మల్ ఆధ్వర్యంలో దండియా, గార్భా మ్యూజిక్ కార్యక్రమం నిర్వహించనున్నారు. కరోనా కారణంగా మూడేళ్ల పాటు ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఈ ఏడాది పరిస్థితులు చక్కబడటంతో మళ్లీ గర్భా దండియా కార్యక్రమంతో సందడి నెలకొననుంది. ఇండియన్ లేడీస్ అసోసియేషన్ గత 65 ఏళ్లుగా భారత్, బహ్రెయిన్ మధ్య సంస్కృతిక సంబంధాలను మెరుగుపర్చేందుకు ఎంతో కృషి చేస్తోంది. ఈ ఏడాది ఉత్సవాల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు ఏఎల్ఏ ప్రెసిడెంట్ షిప్రా ఫస్సీ తెలిపారు.
తాజా వార్తలు
- సల్వా – ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో ఇథియోపియన్ మెస్కెల్ ఫెస్టివల్..!!
- రెండు రోజులు భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
- మిగ్-21 విమాన స్థానంలో తేజస్ జెట్లు
- పండగ సీజన్ లో ప్రత్యేక భీమా కల్పించిన ఫోన్ పే
- అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్య సేవలు
- భారతదేశంలోనే తొలి ‘గ్లోబల్ సెమీకండక్టర్ కాన్స్టిట్యూషన్’ సదస్సు
- భక్తుల సేవ కోసం సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్
- అక్టోబర్ 23 నుంచి ఖతార్ మ్యూజియమ్స్ వార్షికోత్సవ సీజన్..!!
- బహ్రెయిన్ లో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం..!!