తప్పిపోయిన పిల్లల కోసం ‘మిస్సింగ్ అలెర్ట్’ క్యాంపెయిన్: ఖతార్

- September 08, 2022 , by Maagulf
తప్పిపోయిన పిల్లల కోసం ‘మిస్సింగ్ అలెర్ట్’ క్యాంపెయిన్: ఖతార్

దోహా: తప్పిపోయిన పిల్లలను వెతకడంలో సోషల్ మీడయా ప్లాట్ ఫామ్స్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లలో "మిస్సింగ్ అలర్ట్"  మెటా సహకారంతో అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్ ను ఫేస్‌బుక్‌లో విజయవంతంగా ప్రారంభించిన మెటా.. గత జూన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ DG బ్రిగేడియర్ జమాల్ మొహమ్మద్ అల్-కాబీ, పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ అబ్దుల్లా ఖలీఫా అల్-ముఫ్తాహ్, మెటాలో ట్రస్ట్ & సేఫ్టీ డైరెక్టర్ ఎమిలీ వాచెర్, ఉత్తర ఆఫ్రికా-మెటాలోని జిసిసి పబ్లిక్ పాలసీ హెడ్ షాడెన్ ఖల్లాఫ్ ఈ ప్రారంభ వేడుకకు హాజరయ్యారు. నంబియో సేఫ్టీ ఇండెక్స్ 2022 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా ర్యాంక్‌ని పొందిన ఖతార్‌లో ప్రజా భద్రతను పటిష్ఠం చేయడానికి జరుగుతున్న నిరంతర ప్రయత్నాలలో భాగంగా తాజా క్యాంపెయిన్ ను ప్రారంభించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. "మిస్సింగ్ అలర్ట్" సర్వీస్ ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లలో AMBER హెచ్చరిక వ్యవస్థ ద్వారా నిర్వహించబడుతుందన్నారు. తప్పిపోయిన పిల్లల గురించిన సమాచారం 160 కి.మీ పరిధిలో ఉన్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ వినియోగదారులందరికీ మిస్సింగ్ అలెర్ట్స్ కనిపిస్తాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాబోయే FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022తో పాటు నివాసితులు, సందర్శకుల భద్రతను సమర్థంగా ఈ మిస్సింగ్ అలెర్ట్ సర్వీస్ ఉపయోగపడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com