ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- September 08, 2022
అమరావతి: రుణ యాప్ ల నిర్వాహకుల ఆగడాలకు ఎంతోమంది జీవితాలు నాశనమైపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేని రుణ యాప్ లపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు లోన్ యాప్ బెదిరింపులు తట్టుకోలేక రాజమండ్రికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి దంపతులు నిన్న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. న్యూడ్ ఫొటోలు షేర్ చేస్తామంటూ బెదిరించడంతో వారు మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో, వీరి పిల్లలు నాగసాయి (4), లిఖిత శ్రీ (2) అనాధలుగా మిగిలారు. ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరికీ చెరో రూ. 5 లక్షలు సహాయం చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్‌లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!