అబుధాబిలోని అల్ మక్తా బ్రిడ్జి నాలుగు రోజుల పాటు పాక్షికంగా మూసివేత

- September 08, 2022 , by Maagulf
అబుధాబిలోని అల్ మక్తా బ్రిడ్జి నాలుగు రోజుల పాటు పాక్షికంగా మూసివేత

అబుధాబి: అబుధాబిలోని ప్రధానమైన అల్ మక్తా బ్రిడ్జిని నాలుగు రోజుల పాటు పాక్షికంగా మూసివేయనున్నట్లు ఇంటిగ్రేటెడ్ ట్రాన్ పోర్ట్ సెంటర్ (ఐటీసీ) అధికారులు తెలిపారు.అల్ మక్తా బ్రిడ్జి రెండు దారులను గురువారం నుంచి ఆదివారం వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.బ్రిడ్జి పునర్నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసౌకర్యానికి అబుధాబి వాసులు మన్నించాలని ఏటీసీ అధికారులు కోరారు.నాలుగు రోజుల పాటు అల్టర్ నేట్ దారుల్లో ప్రయాణం చేయాలని ప్రజలకు సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com