‘జిన్నా’ టీజర్ టాక్: మంచు విష్ణు చెప్పిందొకటి చేసిందొకటి.!

- September 09, 2022 , by Maagulf
‘జిన్నా’ టీజర్ టాక్: మంచు విష్ణు చెప్పిందొకటి చేసిందొకటి.!

ఇంతవరకూ ‘జిన్నా’ సినిమాని ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌గా చెప్పుకుంటూ వచ్చారు. కట్ చేస్తే, ఈ సినిమా ఓ హారర్ రొమాంటిక్ రొట్ట కామెడీగా తేల్చేశారు ప్రేక్షకులు. ఆగండాగండి సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. జస్ట్ టీజర్ మాత్రమే రిలీజైంది. 
టీజర్‌లోనే దాదాపు సినిమా కథ మొత్తం రివీల్ చేసేసినట్లయ్యింది. ఓ టెంట్ హౌస్ ఓనర్‌ పాత్రలో కనిపిస్తాడు మంచు విష్ణు ఈ సినిమాలో. పంక్చువాలిటీకి ప్రాణం ఇచ్చే జిన్నా లైఫ్‌లో బ్యాడ్ టైమ్ దండిగా నాట్యం చేస్తుంటుంది. అప్పుల బాధతో సతమతమవుతుంటాడు. 
ఆ పరిస్థితి నుంచి బతికి బట్ట కట్టాలంటే, తన లైప్‌లోకి లక్ష్మీదేవి రావాలని కోరుకుంటాడు జిన్నా. సరిగ్గా అదే టైమ్‌లో సన్నీలియోన్ ఎంట్రీ ఇస్తుంది. ఎన్నారై యువతిగా సన్నీలియోన్ ఇంపార్టెంట్ రోల్ పోషించింది ఈ సినిమాలో. పచ్చళ్ల స్వాతిగా పాయల్ రాజ్‌పుత్ నటించింది. అన్నీ అనుకున్నట్లే జరుగుతున్న టైమ్‌లో కథ పూర్తిగా హారర్ టర్న్ తీసుకుంటుంది. సన్నీలియోన్‌లో ఆత్మ ప్రవేశించడం, నన్ను చంపేస్తావా బాబాయ్ అంటూ దెయ్యంలా మారిపోయిన సన్నీలియోన్ డైలాగులు.. అక్కడక్కడా యాక్షన్ టచ్.. ఇదీ ‘జిన్నా’ టీజర్ కథ. 
గత కొంతకాలంగా ప్లాపులతో సావాసం చేస్తున్న మంచు విష్ణుకి ఈ రొమాంటిక్ కామెడీ సక్సెస్ ఇస్తుందా.? చూడాలంటే సినిమా వచ్చేంత వరకూ ఆగాల్సిందే. ఇషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com