ప్రపంచం అత్యంత ఇష్టపడే టాప్ 10 ప్రాంతాల్లో బూర్జ్ ఖలీఫాకు చోటు

- September 09, 2022 , by Maagulf
ప్రపంచం అత్యంత ఇష్టపడే టాప్ 10 ప్రాంతాల్లో బూర్జ్ ఖలీఫాకు చోటు

యూఏఈ: దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫా మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచం అత్యంత ఇష్టపడే టాప్ టెన్ ప్లేసేస్ లో చోటు దక్కించుకుంది. యూజ్ బౌన్స్. కామ్ ఈ ర్యాంక్ లను ప్రకటించింది. టాప్ టెన్ ప్లేసేస్ లో బూర్జ్ ఖలీఫా 8 వ స్థానం దక్కించుకుంది. ఈ జాబితాలో నయాగారా ఫాల్స్ ఫస్ట్ ప్లేస్ లో నిలవగా ఆ తర్వాత తాజ్ మహల్, గ్రాండ్ కాన్ యన్, గోల్డెన్ గేట్ బ్రిడ్జి, స్టాచ్యూ ఆఫ్ లిబర్జీ, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఈఫిల్ టవర్, బూర్జ్ ఖలీఫ్, బన్ఫ్ నేషనల్ పార్క్ వరుస స్థానాలను దక్కించుకున్నాయి. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఆకాశ హర్మ్యాల్లో బూర్జ్ ఖలీఫా ఒకటి. ఇక్కడకు ఏటా కోటి 67 లక్షల మంది టూరిస్టులు ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్నారు. బూర్జ్ ఖలీఫా చూసేందుకు ఎంట్రీ టికెట్ రూపంలోనే ఏటా 621 మిలయన్ డాలర్లు వస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com