బహ్రెయిన్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి ఇండియాలో అరెస్ట్
- September 09, 2022
మనామా: బహ్రెయిన్ నుంచి ఇండియా కు వచ్చిన ఓ వ్యక్తి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు. కేరళలోని కలికట్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. నిందితుడు కొన్ని రోజుల క్రితం బహ్రెయిన్ కు వెళ్లాడు. అక్కడ నుంచి ఇండియాకు వచ్చే క్రమంలో అక్రమంగా బంగారం తీసుకొచ్చాడు. అతని దగ్గర నుంచి 800 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కేరళకు చెందిన 29 ఏళ్ల ఉస్మాన్ గా గుర్తించారు. వారం రోజుల వ్యవధిలో ఇది రెండో సంఘటన. గత వారం ఇదే ఎయిర్ పోర్ట్ లో బ్రహెయిన్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 2.4 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ట్యాక్స్ నుంచి తప్పించుకునేందుకు చాలా మంది బహ్రెయిన్ నుంచి ఇలా అక్రమంగా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రార్థనా స్థలాలే టార్గెట్..కువైట్ లో టెర్రరిస్ట్ అరెస్టు..!!
- ఒమన్ లో ఇన్వెస్ట్ మెంట్స్.. FSA వార్నింగ్ అలెర్ట్..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక.. స్వాగతించిన మిడిలీస్టు, యూరోపియన్..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- హ్యుమన్ ట్రాఫికింగ్..అంతర్జాతీయ రోల్ మోడల్‌గా బహ్రెయిన్..!!
- ఖతార్ లో షెల్ ఎకో-మారథాన్ ఛాంపియన్షిప్..!!
- విప్లవం’ పోస్ట్ తో తమిళనాడులో పెనుదుమారం
- ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఫీజు రూపాయి మాత్రమే
- బాలకృష్ణ–చిరంజీవి వివాదం: 300 కేసుల యోచన రద్దు
- 'తెలుగు తల్లి’ ఫ్లైఓవర్ పేరు ఇకపై 'తెలంగాణ తల్లి'