మహజూజ్ లక్కీ డ్రాలో విజేతలు...
- September 10, 2022
దుబాయ్: మహజూజ్ లక్కీ డ్రాలో మరో ఇద్దరు భారత వ్యక్తులకు జాక్‌పాట్ తగిలింది. దుబాయ్‌లో నిర్వహించిన 92వ మహజూజ్ వీక్లీ డ్రాలో భారత్‌కు చెందిన బిను, జినేష్ చెరో లక్ష దిర్హాములు గెలుచుకున్నారు.ఈ ఇద్దరితో పాటు బ్రిటన్ వాసి మహమ్మద్ లక్ష దిర్హాములు గెలుచుకున్నాడు.ముగ్గురు విజేతలు కూడా తాము గెలిచిన నగదులో కొంత మొత్తం చారిటీకి వినియోగిస్తామని చెప్పి పెద్ద మనసు చాటుకున్నారు.
ఈ సందర్భంగా జినేష్ మాట్లాడుతూ.. ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. తన జీవితంలోనే ఒకేసారి ఇంత భారీ నగదు చూడడం ఇదే తొలిసారి అని తెలిపాడు. గత 17 ఏళ్లుగా దుబాయ్‌లో ఉంటున్న ఈ కేరళ వాసి.. 2020 నుంచి మహజూజ్ డ్రాలో పాల్గొంటున్నట్లు తెలిపాడు. ఓనం పండుగ సెలబ్రెషన్స్‌లో ఉన్న జినేష్‌కు అతడి మిత్రుడు ఫోన్ ద్వారా లాటరీ గెలిచిన విషయాన్ని తెలియజేశాడు. మొదట అతడి మాటలు నమ్మలేదట. ఆ తర్వాత ఆన్లైన్లో చెక్ చేసుకుని విజేతల జాబితాలో తన పేరు కూడా ఉండడంతో ఒక్కసారిగా ఎగిరి గంతేశానని జినేష్ చెప్పుకొచ్చాడు.
మరో విజేత బిను కూడా భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు.14 ఏళ్లుగా యూఏఈలో ఉంటున్న అతడు ఓ ప్రైవేట్ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు.ఈ క్రమంలో స్నేహితుల సూచనతో 2021 నుంచి మహజూజ్ డ్రాలో పాల్గొంటున్నాడు. కానీ, ఇంత తొందరగా తనకు అదృష్టం వరిస్తుందని అనుకోలేని బిను చెప్పాడు.తాను గెలిచిన నగదులో అధిక భాగాన్ని తన ఇద్దరు పిల్లల చదువు కోసం వినియోగిస్తానని చెప్పుకొచ్చాడు.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!