మోస్ట్ పవర్ ఫుల్ పాస్ పోర్ట్ ల జాబితాలో యూఏఈ. 175 దేశాలకు వీసా లేకుండానే !

- September 10, 2022 , by Maagulf
మోస్ట్ పవర్ ఫుల్ పాస్ పోర్ట్ ల జాబితాలో యూఏఈ. 175 దేశాలకు వీసా లేకుండానే !

యూఏఈ: ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ పాస్ పోర్ట్ జాబితాలో యూఏఈ తన స్థానాన్ని పదిల పరుచుకుంది. యూఏఈ పాస్ పోర్ట్ ఉన్న పౌరులు ఇక నుంచి ప్రపంచంలో 175 దేశాలకు వీసా లేకుండానే ఎంటర్ అవ్వొచ్చు. ఇందులో 119 దేశాలకు నేరుగా వెళ్లొచ్చు. మరో 56 దేశాల్లో ఆన్ లైన్ ద్వారా లేదంటే ఆ దేశంలోకి ఎంటరైన తర్వాత వీసా తీసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి మోస్ట్ పవర్ ఫుల్ పాస్ పోర్ట్ కలిగిన కొద్ది దేశాల్లో యూఏఈ కూడా ఉండటం విశేషం. ప్రపంచంలోని మొత్తం 198 దేశాల్లో కేవలం 23 దేశాలకు వెళ్లేందుకు మాత్రం యూఏఈ పాస్ పోర్ట్ కలిగిన వ్యక్తులు ముందుగా వీసా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబితాలో రెండో స్థానంలో జర్మనీ, స్వీడన్, ఫిన్లాండ్, లక్సెంబర్గ్, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, జపాన్, సౌత్ కొరియా దేశాలున్నాయి. ఆయా దేశాల పాస్ పోర్ట్ కలిగిన పౌరులు వీసా లేకుండానే 171 దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com