మటన్‌ కీమా కోఫ్తా కర్రీ

- April 16, 2016 , by Maagulf
మటన్‌ కీమా కోఫ్తా కర్రీ

కావలసిన పదార్థాలు: కీమా మటన్‌ - అరకేజీ, కొత్తిమీర తరుగు - అరకప్పు, జీలకర్ర పొడి - అర టీ స్పూను, కారం - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత. కర్రీ కోసం: నూనె - 1 టేబుల్‌ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 2, వెల్లుల్లి రేకలు - 5, అల్లం తరుగు - 2 టీ స్పూన్లు, టమోటో గుజ్జు - 1 టేబుల్‌ స్పూను, పసుపు - చిటికెడు, గరం మసాల - 2 టీ స్పూన్లు, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, యాలకుల పొడి - అర టీ స్పూను, నీరు - 4 కప్పులు, పెరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత. 

తయారుచేసే విధానం: ఉల్లిపాయ తరిగి కొద్ది నూనెలో దోరగా వేగించి అల్లం, వెల్లుల్లితో కలిపి రుబ్బుకోవాలి. నీరు వడకట్టిన కీమాలో కొత్తిమీర, కారం, జీలకర్ర పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి నిమ్మకాయంత ఉండలు చేసుకుని పక్కనుంచాలి. నూనెలో జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఉల్లి పేస్టు వేగించాలి. టమోటా గుజ్జు, పసుపు, గరం మసాల, దాల్చినచెక్క, యాలకుల పొడి, ఉప్పు, నీరు కలిపి మరిగించాలి. ఇప్పుడు కీమా ఉండల్ని మెల్లగా అందులో వేసి చిన్నమంటపై (గరిటెతో కలపకుండా) గంటన్నర సేపు ఉడికించాలి. కూర చిక్కబడ్డాక పెరుగు వేసి కొత్తిమీరతో అలంకరించి దించేయాలి. రోటీ, నాన్‌తో ఎంతో రుచిగా ఉండే కోఫ్తా కర్రీ ఇది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com