కువైట్ ఎయిర్‌పోర్ట్‌లో విలువైన విదేశీ వాచ్‌లు స్వాధీనం
- September 11, 2022
కువైట్ సిటీ: కువైట్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణికుడు తన షూ సాక్స్‌లో దాచి దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న విలువైన వాచ్‌లను కస్టమ్స్ అధికారుల గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిపై అనుమానం రావడంతో అతన్ని తనిఖీ చేయగా.. విలువైన విదేశీ వాచ్ లు స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. వాచ్ లకు సంబంధించిన ఎటువంటి వివరాలను సదరు ప్రయాణికుడు చెప్పలేకపోయాడని, వాచ్ లకు సంబంధించి బిల్లులు కూడా అతని వద్ద లేవని కస్టమ్స్ అధికారులు తెలిపారు. విలువైన గడియారాలను ప్రయాణికుడు తన షూ సాక్స్ లో దాచిపెట్టి తరలిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించామన్నారు. విదేశీ వాచ్ లకు కస్టమ్స్ సుంకాలను ఎగవేసేందుకు ప్రయాణికుడు ప్రయత్నించాడని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







