తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

- September 11, 2022 , by Maagulf
తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

తిరుమ‌ల: తిరుమల శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారిని గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో భక్తులను దర్శనం ఇచ్చారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెప్పుతారని వేద పండితులు తెలిపారు. జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలిపారని వివరించారు. ఈ కార్యక్రమంలో సివిఎస్వో నరసింహ కిశోర్, వీజీవో బాలిరెడ్డి, పేష్కార్ శ్రీహరి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com