పీపీపీ విధానానికి సంబంధించి కొత్త చట్టం తెచ్చిన యూఏఈ

- September 11, 2022 , by Maagulf
పీపీపీ విధానానికి సంబంధించి కొత్త చట్టం తెచ్చిన యూఏఈ

యూఏఈ: యూఏఈలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మౌలిక రంగంతో పాటు టూరిజం, హాస్పిటాలిటీ  ఇలా అన్ని రంగాల్లో ప్రైవేట్ రంగం పెట్టుబడులను క్రమంగా పెంచే యోచనలో ఉంది. ఇందులో భాగంగా పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) కి సంబంధించిన కొత్త చట్టాన్ని తెస్తున్నట్లు ప్రకటించింది. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తోత్ ఆధ్వర్యంలో ఆదివారం కేబినేట్ భేటీ జరిగింది. ఈ భేటీలో పీపీపీ  కి సంబంధించిన చట్టం గురించి చర్చించారు. యూఏఈ ఎకానమీ ని బలోపేతం చేయటంతో పాటు సోషల్ డెవలప్ మెంట్  లో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచాలని నిర్ణయించినట్లు సమావేశం తర్వాత దుబాయ్ రాజు మహ్మద్ బిన్ రషీద్ ట్వీట్ చేశారు. పీపీపీ విధానంలో రూపొందించిన చట్టం ద్వారా ప్రాజెక్ట్ ల్లో పోటీతత్వం పెరిగి క్వాలిటీ పెరుగుతుందని చెప్పారు. అదే విధంగా యూఏఈ ఆర్థిక వ్యవస్థ కరోనా ముందు నాటికి స్థితికి చేరిందన్నారు. యూఏఈ ఎకానమీకి సంబంధించి ఆయన వరుస ట్వీట్లు చేశారు. యూఏఈ ఫారెన్ ట్రేడ్ ఈ ఏడాది మొదటి హాఫ్ సంవత్సరానికి ఒక ట్రిలియన్ దిర్హామ్ లు దాటిందని చెప్పారు. టూరిజం సెక్టార్ రెవెన్యూ కూడా 19 బిలియన్ డాలర్లు దాటిందని చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com