సౌదీ నేషనల్ డే ను పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్న బహ్రెయిన్
- September 11, 2022
బహ్రెయిన్: సౌదీ అరేబియా నేషనల్ ఈ నెల 23 న జరగనుంది. ఇందుకోసం సౌదీ ఘనంగా ఏర్పాట్లు కూడా చేసింది.ఐతే సౌదీ నేషనల్ డే ను పురస్కరించుకొని బహ్రెయిన్ టూరిజం డిపార్ట్ మెంట్ పలు ప్రత్యేక ఈవెంట్లను ఏర్పాటు చేయటం విశేషం. సౌదీ పర్యాటకులను ఆకర్షించేందుకు బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) ప్రత్యేక ఈవెంట్లను సిద్ధం చేసింది.పలు హోటళ్ల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమాల కోసం ప్యాకేజీలను ప్రకటించింది.బహ్రెయిన్ లోని షాపింగ్ మాల్స్, బీచ్‌లు సహా ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల్లో ఈవెంట్‌లు నిర్వహిస్తారు. బాబ్ అల్-బహ్రెయిన్, అల్ లివాన్ కాంప్లెక్స్, సిటీ సెంటర్ బహ్రెయిన్, ది ఎవెన్యూస్ బహ్రెయిన్, దిల్మునియా మాల్, మనామాలోని సీఫ్ మాల్ మరియు ముహర్రాక్, డిస్ట్రిక్ట్ 1, వాటర్ గార్డెన్ సిటీ, బిలాజ్ లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ప్యాకేజీలను ఇప్పటికే బహ్రెయిన్ టూరిజం డిపార్ట్ మెంట్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
తాజా వార్తలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025