ఎలక్ట్రిక్ కార్గో ఫ్లైట్ కు లైసెన్స్ మంజూరు చేసిన యూఏఈ
- September 11, 2022
యూఏఈ: రవాణా రంగంలో సాంప్రదాయ ఇంధనాన్ని తగ్గించి గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీని పెంచాలని ప్రపంచ దేశాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా దేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. ఐతే యూఏఈ ఒక అడుగు ముందుకేసి ఎలక్ట్రిక్ కార్గో ఫ్లైట్ కు లైసెన్స్ మంజూరు చేయటం విశేషం. సరకు రవాణా కోసం ఉపయోగించి ఈ ఎయిర్ క్రాఫ్ట్ పూర్తిగా క్లీన్ ఎనర్జీ పై ఆధారపడి నడుస్తుంది. ఒక్క శాతం కూడా ఉద్గారాలను విడుదల చేయదు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ ముఖ్తోమ్ ఆధ్వర్యంలో కేబినేట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో తాత్కాలికంగా ఎలక్ట్రిక్ కార్గో ఫ్లైట్ కు లైసెన్స్ మంజూరు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం దుబాయ్ రాజు మహ్మద్ బిన్ రషీద్ ట్వీట్ చేస్తూ రవాణా రంగంలో భవిష్యత్ లో వచ్చే మార్పులకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ వినియోగం లో ఇదొక ముందడుగు అని చెప్పారు. అదే విధంగా రవాణా రంగంలో సప్లయిర్స్ కు వినియోగదారులకు ఖర్చు తగ్గుతుందని చెప్పారు.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!