జెడ్డా, మక్కా మధ్య హరమైన్ రైలు ట్రిప్పు సంఖ్య పెంచే అవకాశం!

- September 11, 2022 , by Maagulf
జెడ్డా, మక్కా మధ్య హరమైన్ రైలు ట్రిప్పు సంఖ్య పెంచే అవకాశం!

జెడ్డా, మక్కా మధ్య హరమైన్ రైలు ట్రిప్పు సంఖ్య పెంచే అవకాశం!

 

సౌదీ: మక్కాకు వచ్చే యాత్రికులకు రవాణా సౌకర్యం మెరుగ్గ ఉండాలన్న ఉద్దేశంతో హరమైన్ ట్రైన్ ట్రిప్పుల సంఖ్య పెంచనున్నారు.ఇందుకు సంబంధించి ఏర్పాట్లను చేస్తున్నట్లు సౌదీలోని రైల్వే అధికారులు తెలిపారు.హరమైన్ ట్రైన్  జెడ్డాలోని సులేమానియా స్టేషన్ నుంచి మక్కా స్టేషన్ రోజు తిరుగుతుంటుంది. ఐతే ఈ రైలు ట్రిప్పుల సంఖ్య ను 32 కు పెంచాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. మక్కా వెళ్లే యాత్రికులకు ఈ రైలు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. సులేమానియా స్టేషన్ నుంచి మక్కా వెళ్లేందుకు కనీస ధర 32 రియాలు గా నిర్ణయించారు. ఈ రైలు ట్రిప్పుల సంఖ్య పెంచాలని మక్కా కు వచ్చే యాత్రికులు కూడా కోరుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com