బహ్రెయిన్ లో అక్టోబర్ 25న పాక్షిక సూర్యగ్రహణం

- September 12, 2022 , by Maagulf
బహ్రెయిన్ లో అక్టోబర్ 25న పాక్షిక సూర్యగ్రహణం

బహ్రెయిన్ : అక్టోబర్ 25, 2022న పాక్షిక సూర్యగ్రహణం ఉందని బహ్రెయిన్ ఖగోళ శాస్త్రవేత్త, పరిశోధకుడు అలీ మజీద్ అల్-హజ్రీ తెలిపారు. ఈ ఏడాదిలో ఇది రెండో పాక్షిక సూర్యగ్రహణమన్నారు. దీనిని ఐరోపాలోని అధిక భాగం, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఆసియాలోని పశ్చిమ ప్రాంతాల నుండి స్పష్టంగా చూడవచ్చన్నారు. బహ్రెయిన్‌లో గ్రహణం 2 గంటల 18 నిమిషాల రెండు సెకన్ల పాటు ఉంటుందని అల్ హజ్రీ తెలిపారు. గ్రహణం మధ్యాహ్నం 01:32 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 02:44 గంటలకు గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని, మధ్యాహ్నం 03:55 గంటలకు ముగుస్తుందని అల్ హజ్రీ తెలిపారు. బహ్రెయిన్ లో చివరి పాక్షిక సూర్యగ్రహణం డిసెంబర్ 26, 2019న వచ్చిందని అల్ హజ్రీ గుర్తు చూశారు. అలాగే  నవంబర్ 8, 2022న చంద్రగ్రహణాన్ని కూడా బహ్రెయిన్ వాసులు చూడవచ్చని ఆయన పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com