విషాదం.. బస్సులో చిక్కుకొని కిండర్ గార్టెన్ స్టూడెంట్ మృతి

- September 12, 2022 , by Maagulf
విషాదం.. బస్సులో చిక్కుకొని కిండర్ గార్టెన్ స్టూడెంట్ మృతి

దోహా: ఒక ప్రైవేట్ కిండర్ గార్టెన్‌లో చదువుతు నాలుగేళ్ల స్టూడెంట్ మృతికి విద్య, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. విద్యార్థుల భద్రతా ప్రమాణాలకు అందరూ కట్టుబడి ఉండాలని, ఈ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. మరణించిన విద్యార్థి కుటుంబానికి మంత్రిత్వ శాఖ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న ఉదయం స్ప్రింగ్‌ఫీల్డ్ కిండర్ గార్టెన్ అల్ వక్రాలో చదివే KG 1 విద్యార్థి మిన్సా మరియం జాకబ్(4) రోజులాగే పాఠశాల బస్సులో స్కూల్ కి వెళ్లింది. నిద్రపోయిన మరియం.. ఇతర విద్యార్థులతోపాటు బస్సు దిగలేదు. ఈ విషయాన్ని బస్సు సిబ్బంది గమనించకుండా.. లాక్ చేసి పార్కింగ్ లో నిలిపి ఉంచారు. తిరిగి విధుల్లో చేరిన బస్సు సిబ్బంది చిన్నారిని గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించినా నాలుగేండ్ల చిన్నారి ప్రాణాలను కాపాడలేకపోయారు. మరణానికి గల కారణాలపై అధికారిక నివేదిక రావాల్సి ఉంది. ఇండియాలోని కేరళకు చెందిన అభిలాష్ చాకో, సౌమ్య చాకోల రెండవ కుమార్తె మిన్సా మరియం. ఈ రోజు తన నాల్గవ పుట్టినరోజును జరుపుకోవాల్సిన చిన్నారి మరియం.. విగతజీవిగా మారడం వారి కుటుంబసభ్యలను తీవ్రంగా కలచివేస్తోంది. దౌత్యపరమైన ప్రక్రియలు పూర్తి చిన్నారి మరియం మృతదేహాన్ని స్వదేశానికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు మృతుల కుటుంబ సభ్యులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com